అనాథలకు అండగా పుట్టల మహేష్ యాదవ్..

బాలానగర్, ఆంధ్రప్రభ : తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా జీవనం సాగిస్తున్న పిట్టల జ్యోతి, పిట్టల కుమార్‌కు పుట్టల మహేష్‌ యాదవ్‌ అండగా నిలిచారు. జ్యోతి వివాహం సందర్భంగా తనవంతు సహాయంగా రూ.5 వేల ఆర్థిక సాయం అందించారు.

పిట్టల కుమార్‌ గత కొన్ని సంవత్సరాలుగా బాలానగర్‌ గ్రామపంచాయతీలో కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులు లేకపోయినా కష్టపడి జీవనం సాగిస్తున్న కుమార్‌కు, చెల్లెలి వివాహ సమయంలో పుట్టల మహేష్‌ అందించిన ఆర్థిక సాయం ఎంతో ఉపయోగకరంగా మారింది.

పిట్టల జ్యోతికి ఇటీవల వివాహం నిశ్చయమై, నిశ్చితార్థం కూడా పూర్తయింది. ఈ నెల 16న బాలానగర్‌ మండల కేంద్రం సమీపంలోని అయ్యప్ప దేవాలయంలో ఆమె వివాహం జరగనుంది. కష్టకాలంలో తమకు అండగా నిలిచి, చెల్లెలి వివాహానికి ఆర్థిక సాయం అందించిన పుట్టల మహేష్‌ యాదవ్‌కు పిట్టల జ్యోతి, కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు.