స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి..

  • ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్

జగిత్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను గురువారం జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా జగిత్యాల జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఆగష్టు 15 స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించిన వేదిక నిర్మాణం, పతాకావిష్కరణ స్థలం, సాంస్కృతిక కార్యక్రమాల ప్రాంగణం, స్టాల్స్, పార్కింగ్, భద్రతా చర్యలు వంటి అంశాలను ప్రత్యక్షంగా సమీక్షించారు. జిల్లావ్యాప్తంగా జరిగే కార్యక్రమాలకు తగినట్లుగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు.

రెవెన్యూ, పోలీస్, డి ఆర్ డి ఓ, మున్సిపల్ సంబంధిత అధికారులతో సమన్వయం పెంచుతూ భద్రతా బందోబస్తును, ఏర్పాట్లను ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఆహ్వానితులకు, విద్యార్థులకు, ప్రజలకు అవసరమైన నీటి సదుపాయాలు, వైద్య సిబ్బంది, శానిటేషన్ వ్యవస్థలను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. పతాకావిష్కరణ అనంతరం జరిగే అట్టహాసపూరిత పరేడ్, శకటాలు, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లను పరిశీలించారు. విధుల్లో ఎటువంటి నిర్లక్ష్యం చోటు చేసుకోకుండా అధికారులు కట్టుదిట్టంగా పర్యవేక్షించాలని ఆమె సూచించారు.

ప్రభుత్వ గౌరవాన్ని నిలబెట్టేలా అన్ని ఏర్పాట్లు నాణ్యతతో చేయాలని అన్నారు. జిల్లా ప్రజలంతా స్వాతంత్ర దినోత్సవ దినోత్సవాన్ని గౌరవంగా, దేశభక్తి వాతావరణంలో జరుపుకోవాలని ఆహ్వానించారు. ఈ పరిశీలనలో అదనపు కలెక్టర్లు బిఎస్.లత, బి. రాజ గౌడ్, డిఆర్డిఏ రఘువరన్, డిపిఆర్వో శ్రీధర్, సంబంధిత జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏ.వో కిషన్, ఎమ్మార్వో రామ్మోహన్, రెవిన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, డిఆర్డిఎ సిబ్బంది, పోలీస్ శాఖ సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.