ఆలయ గోశాలకు రూ.50,011 విరాళం..
గంపలగూడెం, ఆంధ్రప్రభ : జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం మండలంలోని నెమలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ గోశాలలోని గోవుల పోషణ నిమిత్తం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం మీనవోలుకు చెందిన యన్నం ప్రభాకరెడ్డి – అన్నపూర్ణ దంపతులు రూ.50,011 గురువారం విరాళంగా అందజేశారని ఆలయ సహాయ కమీషనర్ నేల సంధ్య తెలిపారు. స్వామి వారి దర్శనం అనంతరం అర్చకుడు పి.శాయాచార్యులు దాతలకు ప్రసాదం,స్వామి వారి చిత్రపటం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
