బీజేపీ అధ్యర్యంలో ఘనంగా తిరంగా ర్యాలీ..

వేల్పూర్, ఆంధ్రప్రభ : ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమంలో భాగంగా వేల్పూర్ మండలంలో దేశభక్తిని చాటుతూ తిరంగా ర్యాలీ నిర్వహించారు. బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ డా. మల్లికార్జున్ రెడ్డి ఆదేశాల మేరకు, బీజేపీ మండల అధ్యక్షుడు బేల్దారి నవీన్ ఆధ్వర్యంలో లక్కోర ఉన్నత పాఠశాల నుండి వేల్పూర్ ఎక్స్ రోడ్ వరకు ర్యాలీ ఘనంగా సాగింది. కార్యకర్తలు చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకొని “భారత్ మాతాకీ జై” నినాదాలతో హోరెత్తించారు.

ఈ సందర్భంగా బేల్దారి నవీన్ మాట్లాడుతూ ఆగస్టు 15 వరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై మువ్వన్నెల జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లక్కోర సర్పంచ్ అపర్ణ రాజు, కిషన్ మోర్చా మండల అధ్యక్షుడు అడవల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి భానుచందర్, నాగేష్, కిషన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్దన్న, కొల్లెరాము, జక్క నరసయ్య, నాగరాజు, నర్సారెడ్డి, ఆడవల తిరుపతి, భూసా అభిషేక్, రాజేష్, సృజన్ గౌడ్, మహేందర్, బద్దం సురేష్, మోహన్, ప్రవీణ్, చెడుమెల నాగరాజ్, రవితేజ, క్రాంతి, రాము, ప్రణయ్, సాయినందు, బబ్లు తదితరులు పాల్గొన్నారు.