వ్యక్తి దారుణ హత్య…

మంగపేట, ఆగస్టు 13 ( ఆంధ్రప్రభ): ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం ఏటూరు నాగారం మండలం రాంనగర్ గ్రామాల నడుమ బుధవారం రాత్రి మంగపేట మండలం నరసింహసాగర్ గ్రామపంచాయతీ పరిధిలోని గొందిగూడెం గ్రామానికి చెందిన తాటి శశి కుమార్ (32) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు. గొందిగూడెం గ్రామానికి చెందిన తాటి శశి కుమార్ కమలాపురంకి చెందిన ఓ రైతు వద్ద పనిచేస్తూ వ్యవసాయ పొలంలోని పాకల వద్ద నివాసం ఉంటున్నాడు.

ఈ క్రమంలో బుధవారం రాత్రి తోటి పనివాళ్ళతో గొడవ జరిగింది. ఆ గొడవలో కొప్పుల నరసింహారావు, కొప్పుల లక్ష్మి అనే భార్యాభర్తలిద్దరూ తాటి శశి కుమార్ ను గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేసి పరారయ్యారు . సమాచారం తెలుసుకున్న మంగపేట ఎస్సై టివిఆర్ సూరి ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించి అనంతరం హత్యకు పాల్పడ్డమండలంలోని పూరేడుపల్లి గ్రామానికి చెందిన కొప్పుల నరసింహారావు, కొప్పుల లక్ష్మి లను అదుపులోకి తీసుకుని మంగపేట పోలీస్ స్టేషన్ తరలించారు. మృతి చెందిన తాటి శశి కుమార్ కు భార్య రాధిక, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కాగా హత్య జరిగిన సమాచారం తెలుసుకున్న పోలీసులు గంటలోపే నిందితులను అదుపులోకి తీసుకోవడంతో పోలీసుల తీరును స్థానికులు అభినందిస్తున్నారు.