అభయాంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాల ఊరేగింపులో ఎమ్మెల్యే
గద్వాల, ఆంధ్రప్రభ: గద్వాల పట్టణంలోని మూడో వార్డు హమాలీ కాలనీలోని శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఆషాఢ మాస చివరి అమావాస్య సందర్భంగా బుధవారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎడ్లబండ్లపై ఉత్సవ విగ్రహాల ఊరేగింపును ప్రారంభించారు.
ఈ సందర్భంగా దేవాలయ కమిటీ సభ్యులు, కౌన్సిలర్ నాగులు యాదవ్ ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. ప్రతి అమావాస్య సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం, ఉత్సవ విగ్రహాల ఊరేగింపు నిర్వహించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ భక్తిభావంతో మెలగాలని సూచించారు.
సకాలంలో వర్షాలు కురిసి రైతులకు మంచి పంటలు పండాలని, గిట్టుబాటు ధరలు లభించాలని ఆకాంక్షించారు. వ్యాపారస్తులు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో జీవించాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో కౌన్సిలర్ నాగులు యాదవ్, మాజీ ఎంపీపీ విజయ్, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజశేఖర్, జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ సభ్యుడు కురుమన్న, నాయకులు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.
