బైక్ అదుపుతప్పి యువకుడికి తీవ్ర గాయాలు
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలంలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. నర్సింగ్‌పల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు బైక్‌పై భీమ్‌గల్–బడా భీమ్‌గల్ ప్రధాన రహదారిపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు వాహనం అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు.
ఈ ప్రమాదంలో యువకుడి తలకు, శరీరంలోని పలు భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి గల పూర్తి కారణాలు, యువకుడి పరిస్థితికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
