వందేమాతరం ప్రతి ఒక్కరిలో దేశభక్తిని నింపుతుంది

  • ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు

భీమవరం, ఆంధ్రప్రభ: వందేమాతర గీతం ప్రతి ఒక్కరి హృదయాలలో దేశభక్తి స్ఫూర్తినీ నింపుతుందని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. భీమవరం సాగి రామకృష్ణమరాజు ఇంజనీరింగ్ కళాశాలలో కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం, ఏబీవీపీ కళాశాల యాజమాన్యం సంయుక్తంగా వందేమాతర గీతం 150 వసంతాల వేడుక, నిషా ముక్తి భారత్ అభియాన్ కార్యక్రమాలు నిర్వహించింది. పట్నంలో కళాశాలలు విద్యాసంస్థల కు చెందిన వేలాది మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వేలాది గొంతుకలు ఒక్కటే వందేమాతర గీతాన్ని ఆలపించారు. అనంతరం ఎస్ ఆర్ కే ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె వి మురళీకృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ నాటి స్వతంత్రోద్యమ పోరాటంలో దేశభక్తులకు హృదయం నిండా దేశభక్తి నింపి దేశ స్వతంత్రం కోసం పోరాడే యోధులుగా తీర్చిదిద్దటంలో వందేమాతర గీతం వారిలో విప్లవ జ్వాలాలు వెలిగించాయని పేర్కొన్నారు.

అటువంటి మహత్తర గీతాన్ని 150 సంవత్సరాల తర్వాత పూర్తి గీతం ఆలపించే విధంగా భారత రాష్ట్రపతి ఇదే రోజు చట్టం తీసుకురావటం దేశంలో అరుదైన పరిణామంగా ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ దేశభక్తి స్ఫూర్తి నింపుకొని సేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షులు వి శ్రీనివాసరావు మాట్లాడుతూ భతించంద్ర చటర్జీ రసించిన వందేమాతర గీతం ప్రతి భారతీయ యువకుడి హృదయంలో నిలిచి దేశభక్తి స్ఫూర్తిని నింపిందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సాగి రామకృష్ణ నిషాంత వర్మ, డైరెక్టర్ డాక్టర్ జగపతి రాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కె వి మురళీకృష్ణంరాజు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిహెచ్ దిలీప్ చక్రవర్తి మాట్లాడుతూ తమ కళాశాలలో దేశభక్తి స్ఫూర్తిని నింపిన వందేమాతర గీతం వేలాదిమంది విద్యార్థులతో ఆలపించడం ఎంతో ఆనందకరంగా ఉందన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు కలిదిండి వినోద్ వర్మ మాట్లాడుతూ.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వికసిత్ భారత్ తలక్షాల్లో భాగంగా ప్రతి యువకుల్లోనూ దేశభక్తిని నింపి దేశం కోసం పోరాడేలా చేస్తున్నారని పేర్కొన్నారు.

కార్యక్రమంలో భీమవరం డిఎస్పి రఘువీర్ విష్ణు ఏబీవీపీ, ఎన్ఎస్ఎస్ విభాగం విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మత్తు పదార్థాలకు పానీయాలకు దూరంగా ఉంటామని చేశారు. అనంతరం మూడువేల అడుగుల జాతీయ పతాకంతో కళాశాల నుండి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు ప్రదర్శనగా వెళ్లి అల్లూరికి ఘన నివాళులర్పించారు.