రెండవ రోజు కోనసాగుతున్నా మునిసిపల్ కాంట్రాక్టర్ల సమ్మె..
- సర్కిల్ వారిగా అభివృద్ది పనులు నిలిపి వేత
- పనులు జరగకుండా కాంట్రాక్టర్ల టీమ్ లు ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్లు
- ఎకౌంట్ సెక్షన్.. ఇంజనీరింగ్ సెక్షన్ అధికారుల తో కొనసాగిన చర్చలు
- రూ. 300 కోట్లు బిల్లులు బకాయిలు చెల్లించాలి కాంట్రాక్టర్ల విజ్ఞప్తి
- పెద్ద మొత్తం లో బకాయి బిల్లులు ఇచ్చే పరిస్థితి లో కార్పోరేషన్ లేదు
- ప్రస్తుతానికి రూ.37 కోట్లు లోన్ ద్వారా ఇచ్చుటకు అధికారుల హామీ
- కనీసం రూ.190 కోట్లు అయినా లోన్ సౌకర్యం కల్పించాలని కాంట్రాక్టర్ల విజ్ఞప్తి
- కార్పోరేషన్ అధికారుల కు స్వీట్స్ పంపిణీ చేస్తు నిరసన తెలియజేసిన కాంట్రాక్టర్లు
- అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాయన అధిబాబు వెల్లడి…!
విజయవాడ కార్పోరేషన్, ఆంధ్రప్రభ ; విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో కాంట్రాక్టర్లు దాదాపు 150 మంది అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నారు.వీరికి దాదాపు రూ.350 కోట్ల మేర బకాయి బిల్లులు ఉన్నాయి. బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు అధికారులకు,ప్రజా ప్రతి నిధులకు వినతి పత్రాలు ఇచ్చిన వారికి స్పష్టంమైన హామీ రాక పోవటం తో సమ్మె చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. కాంట్రాక్టర్లు సోమవారం రాత్రి అధికారులు తో చర్చలు జరిపినప్పటికీ హామీ రాకపోవటం తో రెండవ రోజు పనులు నిలుపు చేసి కాంట్రాక్టర్లు సమ్మె కొనసాగిస్తున్నారు.

విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలోనీ అభివృద్ధి పనులు చేసే కాంట్రాక్టర్ల కు రూ.350 కోట్ల బిల్లులు బకాయిలు చెల్లించాలని రెండు రోజుల గా నగరం లో అభివృద్ధి పనులు నిలుపు చేసి సమ్మె చేస్తున్నారు. కాంట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు, ఎకౌంట్ సెక్షన్,ఇంజనీరింగ్ సెక్షన్ అధికారుల తో బిల్లులు చెల్లింపుల అంశం పై చర్చలు జరిపినప్పటికీ కాంట్రాక్టర్లు రూ.350 కోట్లు బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు మాత్రం కార్పోరేషన్ దగ్గర అన్ని రూపాయలు లేవు అని,అసలు పరిస్థితి బాగోలేదని అధికారులు కాంట్రాక్టర్ల కు తేల్చి చెప్పినట్లు అసోసియేషన్ సభ్యులు,ప్రధాన కార్యదర్శి రాయన అధిబాబు వెల్లడించారు.

అధికారులు మాత్రం లోన్ ద్వారా రూ.37 కోట్లు ఇప్పంచ గలం అని కాంట్రాక్టర్ల కు అధికారులు చర్చలో వివరించారు. ఆయితే కాంట్రాక్టర్లు మాత్రం లోన్ ద్వారా కనీసం రూ.190 కోట్ల రూపాయలు మంజూరు చేయించాలని అధికారులను కోరారు. అధికారులు సానుకూలంగా స్పందించినట్లు సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్లు కార్పొరేషన్ లో అధికారుల కు స్వీట్స్ పంపిణీ చేసి త్వరగా బిల్లులు మంజూరు చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమం లో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
