ఐక్యంగా పోరాడి హక్కులను సాధించుకోవాలి
పద్మశాలీల సంక్షేమ పథకాలను సాధించేందుకు ఉద్యమించాలి
మరిపెడ, ఆంధ్రప్రభ: కుల విచ్ఛిన్న శక్తులను ఎదుర్కొని ఐక్యంగా పోరాడి హక్కులను సాధించుకోవాలని జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు వేముల వెంకన్న అన్నారు. మంగళవారం మరిపెడ మండల కేంద్రంలోని కనకదుర్గ కళ్యాణ మండపంలో డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల పద్మశాలి సంఘం ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. మరిపెడ సంఘం అధ్యక్షుడు దిగిజెర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు వేముల వెంకన్న హాజరయ్యారు.
ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ పద్మశాలీల హక్కుల సాధన కోసం ఉద్యమించాలని కోరారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ పథకాలను సాధించుకునేందుకు సంఘటితంగా కృషి చేయాలని సూచించారు. పద్మశాలీల సమస్యల పరిష్కారానికి నాయకులు, సభ్యులు ఐక్యంగా పనిచేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు, చలిమల్ల నారాయణ, ఊరుకొండ శ్రీనివాస్, బత్తుల రమేష్, కొండబత్తిని జగదీశ్వర్, కొండబత్తుల వెంకన్న, దాసరి నరేందర్, వెన్నం జనార్ధన్, మేనామ్ వెంకన్న, మాసబత్తిని సతీష్, దిగిజెర్ల ముఖేష్, మేకల యాకయ్య, బాల్యం శ్రీనివాస్, ఆనబత్తుల కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
