నిరంతర అభివృద్ధి సెంట్రల్ ఎమ్మెల్యే ధ్యేయం: బొండా రవితేజ

పాయకాపురం, ఆంధ్రప్రభ: నియోజకవర్గ పరిధిలోని అన్నీ డివిజన్లు నిరంతర అభివృద్ధి చేయడం సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ధ్యేయమని టీడీపీ యువ నాయకుడు బొండా రవితేజ అన్నారు. స్థానిక 64వ డివిజన్ కండ్రిక కేకే.అపార్ట్మెంట్స్, నాలుగు స్తంభాల సెంటర్ వరకు రెండేళ్ల నమ్మకం సంక్షేమం, అభివృద్ధి ఇంటింటికీ తెలుగుదేశం ప్రచార కార్యక్రమం మంగళవారం డివిజన్ అధ్యక్షుడు కె.రవికుమార్, టీడీపీ శ్రేణులతో కలసి నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా తనయుడు బొండా రవితేజ పాల్గొని ఇంటింటికి టీడీపీ కార్యక్రమం ద్వారా రెండేళ్ల అభివృద్ధి సంక్షేమం కర పత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కె. రవికుమార్ వరలక్ష్మి,సాదం శ్రీనాద్, పొన్నం శేషగిరిరావు, దేవిరెడ్డి శంకర్,మహిళ సెంట్రల్ అధ్యక్షురాలు పైడి తులసి, ప్రదాన కార్యదర్శి ఎస్.కె బాబు,క్లస్టర్ ఇంచార్జి కోమరి రాజేష్,కంకణాల బాబు, సూరవరపు నాగరాజు, బొడ్డు కిషోర్, అప్పలనాయుడు,టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.