కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వావిలాల రాంబాబు
తాడ్వాయి, ఆంధ్రప్రభ: ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన వావిలాల రాంబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రంలో ఎస్సీ సెల్ జిల్లా కమిటీని మంత్రి సీతక్క ప్రకటించారు. ఈ సందర్భంగా వావిలాల రాంబాబును జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసినట్లు తెలిపారు.
గత 20 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేసినందుకు పార్టీ తనను గుర్తించి జిల్లా ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించిందని రాంబాబు తెలిపారు. ఇకపై మరింత కష్టపడి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ తగిన సమయంలో గుర్తింపు లభిస్తుందని అన్నారు.
తనను జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేయడానికి సహకరించిన జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగా కళ్యాణి, మండల అధ్యక్షుడు మంకిడి నరసింహస్వామి, మండల మాజీ అధ్యక్షుడు బొల్లు దేవేందర్ ముదిరాజ్, జిల్లా నాయకులు, పార్టీ శ్రేణులకు రాంబాబు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
