విద్యావేత్త సుభాష్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా

భిక్నూర్, ఆంధ్రప్రభ: ప్రముఖ వ్యాపారవేత్త, విద్యాదాత, ఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి జన్మదిన వేడుకలను భిక్నూర్‌ మండలంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.

జన్మదినాన్ని పురస్కరించుకుని ఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో భిక్నూర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను పంపిణీ చేశారు. అనంతరం భిక్నూర్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కేక్‌ కటింగ్‌ కార్యక్రమంలో ఫౌండేషన్‌ సభ్యులు, అభిమానులు పాల్గొని సుభాష్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ సభ్యులు మాట్లాడుతూ.. సేవే లక్ష్యంగా, ప్రజలే బలంగా ముందుకు సాగుతున్న సుభాష్‌రెడ్డి ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు. ప్రజలతో మమేకమై సేవా కార్యక్రమాలతో జన్మదిన వేడుకలు నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

భవిష్యత్‌లోనూ ప్రజా సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపడతామని ఫౌండేషన్‌ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో భిక్నూర్‌ మండల ఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.