క్షణాల్లో స్కూల్‌ బస్సు దగ్ధం.. తప్పిన పెను ప్రమాదం

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో స్కూల్‌ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 17 మంది విద్యార్థులతో వెళ్తున్న బస్సులో మంటలు కనిపించడంతో డ్రైవర్‌, పాఠశాల సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే విద్యార్థులను బస్సు నుంచి కిందకు దించడంతో పెను ప్రమాదం తప్పింది.

బస్సులో మంటలు చెలరేగిన విషయాన్ని గమనించిన వెంటనే డ్రైవర్‌, సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి విద్యార్థులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

అయితే ఫైర్‌ సిబ్బంది చేరుకునేలోపే మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్‌, పాఠశాల సిబ్బంది అప్రమత్తతతో వ్యవహరించడంతో విద్యార్థులకు ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.