ప్రియాంక ఘటనపై గళమెత్తిన విద్యార్థులు
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన వైద్య విద్యార్థిని ప్రియాంక సంఘటనలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని ఇబ్రహీంపట్నంలో విద్యార్థులు సోమవారం కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని నిరసన తెలిపారు. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
