ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ
పామర్రు, ఆంధ్రప్రభ: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన చెక్కులను పామర్రు నియోజకవర్గానికి చెందిన 26 మంది లబ్ధిదారులకు అందజేశారు. పామర్రు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మొత్తం రూ.4,60,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని నాయకులు తెలిపారు.
కార్యక్రమంలో కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
