ఉప సర్పంచుల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడిగా చాకలి మహేష్

తాడ్వాయి ఆంధ్రప్రభ: ఉప సర్పంచుల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడిగా తాడ్వాయి మండలం కన్కల్ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ చాకలి మహేష్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. ఉప సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బొట్టు కార్తీక్ ఆధ్వర్యంలో మహేష్‌ను జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించినట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా చాకలి మహేష్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి జిల్లా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉప సర్పంచుల అభ్యున్నతికి పాటుపడతానని, వారి హక్కుల కోసం పోరాడుతానని అన్నారు.

స్థానిక సంస్థలను పటిష్టం చేయడంలో ఉప సర్పంచుల ఫోరం ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. తనకు అప్పగించిన పదవిని బాధ్యతగా నిర్వహిస్తానని పేర్కొన్నారు. తాడ్వాయి మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఎర్రపాడు గ్రామానికి చెందిన ప్రభాకర్‌రెడ్డిని నియమించినట్లు మహేష్ తెలిపారు.