CM Chandrababu | కీలక ఆదేశాలు..

22-ఏ జాబితా నుంచి భూముల తొలగింపునకు సీఎం ఆదేశాలు
కలిదిండిలో రైతుల భూ సమస్యలపై చంద్రబాబు సానుకూల స్పందన
830 కుటుంబాలకు చెందిన 2,745 ఎకరాల భూములకు రిజిస్ట్రేషన్‌కు మార్గం సుగమం
10ఎండీవిఎల్ 2:సమావేశం లో రైతులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు


కలిదిండి, ఆగస్టు 10(ఆంధ్రప్రభ) : ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని కలిదిండిలో సోమవారం నిర్వహించిన ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో రైతులు, మాజీ సైనికులతో సీఎం సమావేశమై వారి భూ, రెవెన్యూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పలువురు రైతులు తమ భూములను 22-ఏ జాబితాలో చేర్చడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను సానుకూలంగా విన్న చంద్రబాబు వెంటనే స్పందించి, సంబంధిత భూములను 22-ఏ జాబితా నుంచి తొలగించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. అలాగే ఆర్డీఓకు డీనోటిఫికేషన్‌ అధికారాలు కల్పించాలని అధికారులకు సూచించారు.

అనంతరం రైతులు, లబ్ధిదారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు 1-బి అడంగల్‌ ప్రతులను అందజేశారు. ఉనికిలి, కలిదిండి, వైవాక గ్రామాల్లోని 830 కుటుంబాలకు చెందిన 2,745 ఎకరాల భూములు రైతుల పేర్లపై రిజిస్ట్రేషన్‌ అయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తమ దీర్ఘకాలిక భూ సమస్యకు పరిష్కారం చూపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం తమ సమస్యలను నేరుగా విని పరిష్కరించడంపై హర్షం వ్యక్తం చేశారు.