పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం..

  • 23 మందికి చెక్కులు అందించిన మాజీ ఎంపీ సీతారామలక్ష్మి

భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాజ్యసభ మాజీ సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ టిడిపి ఇన్ ఛార్జ్ తోట సీతారామలక్ష్మి అన్నారు. భీమవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో సోమవారం 23 మంది లబ్ధిదారులకు ఎల్.ఓ.సి మరియు ముఖ్యమంత్రి సహాయనిధి రూ 16,56,033 చెక్కులను అందించారు. ఈ సందర్భంగా సీతారామలక్ష్మి మాట్లాడుతూ వైద్య చికిత్సలు, అత్యవసర శస్త్ర చికిత్సలకోసం పేద కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా సకాలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్‌వోసీ మంజూరి పత్రాలు అందజేస్తూ ఆపత్కాలంలో ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.

మాజీ మున్సిపల్ చైర్మన్ మెరగాని నారాయణమ్మ మండల మరియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని అన్నారు. పట్టణ,మండల అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ భీమవరం టిడిపి ఇన్చార్జి తోట సీతారామలక్ష్మి ద్వారా సుమారు మూడున్నర కోట్ల రూపాయల పైగా సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి షబీనా భీమవరం పట్టణ, వీరవాసరం, భీమవరం మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మద్దుల రాము చెల్లబోయిన గోవింద్, కొల్లేపర శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, కొయ్యలగడ్డ గణపతి, కోళ్ల సీతారాం, మాజీ కౌన్సిలర్లు ఎద్దు ఏసుపాదం, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కోళ్ల నాగబాబు, జిల్లా కార్యదర్శులు పంజా వెంకటేశ్వరరావు, రేవు వెంకన్న, పట్టణ టిడిపి తెలుగు యువత అధ్యక్ష ఉపాధ్యక్షులు గోలగాని రమేష్, చెరుకు తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.