శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలి
ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నూతన ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు చేపట్టిన ఉదయ్‌కిరణ్‌ను పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉదయ్‌కిరణ్ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సముద్రాల ఐడియా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సముదాల రవి, ఉపాధ్యక్షుడు బెల్లీదే కాశి, రాష్ట్ర నాయకులు పసుపునూరి వీరేశం, మండల అధ్యక్షుడు నాగబండి మధు, జిల్లా ఉపాధ్యక్షులు సముదాల సత్యం, చోల్లేటి ప్రకాష్, నాయకులు గంప కృష్ణ, గందె అంజయ్య, పొద్దుటూరు కుమార్ తదితరులు పాల్గొన్నారు.
