కూటమి ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం..

సెంట్రల్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు


పాయకాపురం, ఆగస్టు 10 (ఆంధ్రప్రభ) : డీఎస్సీ అక్రమాలపై, ఫీజు రియంబర్స్మెంట్ నిరుద్యోగ భృతి,ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు, కూటమి ప్రభుత్వ మోసపూరిత విధానాలను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు మేరకు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలకు, ర్యాలీలకు పిలుపునిచ్చారు.

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్యాలయం నుండి పైపులరోడ్డు, ప్రకాష్ నగర్, కండ్రిక ప్రాంతం వరకు వైసీపీ శ్రేణులు ర్యాలీకి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో వైసీపీ ర్యాలీకి అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేశారని వైసీపీ శ్రేణులు పేర్కొంటున్నారు.ఐతే మల్లాది విష్ణు సింగ్ నగర్ ఆయన కార్యాలయానికి రాగా, మాజీ డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ రెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ కార్పొరేటర్లు, వైసీపీ శ్రేణులు ఆయన వెంట కార్యాలయానికి తరలి వెళ్లారు.

ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందు కూటమి ప్రభుత్వం, పోలీసులతో ఆంక్షలు విధిస్తూ ప్రజా సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అనేక విధాలుగా ఆపేందుకు ప్రయత్నిస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని మల్లాది విష్ణు పేర్కొన్నారు.