వైశ్య కుటుంబాల సర్వే చేపట్టాలి

మహబూబాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య సభ మహబూబాబాద్‌ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు పొద్దుటూరి గౌడ్‌ శంకర్‌ మాట్లాడుతూ వైశ్య కుల కుటుంబ సభ్యుల సర్వే చేపట్టాలని సూచించారు. సెప్టెంబర్‌ 15లోపు సభ్యత్వాల నమోదు పూర్తి చేసి జిల్లా కమిటీకి అందజేయాలని, సభ్యత్వానికి సంబంధించిన వివరాలను కమిటీ చైర్మన్‌ మాలే యోగేశ్వరరావుకు అందించాలని తెలిపారు.

సమావేశంలో లక్ష్మీనరసింహారావు, వెంకట్రామారావు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ జగదీశ్వర్‌, ఓలం కృష్ణమూర్తి, వెన్నాకుల శ్రీనివాస్‌, తొర్రూరు మండల నాయకులు మచ్చ సోమయ్య, మచ్చ సురేష్‌, ఇమ్మడి రాంబాబు, చౌడారపు రాము, వేణుమాధవ్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.