ప్రమాదంలో పర్యావరణం.. బహుళ సంక్షోభంలో ప్రపంచం

పర్యావరణ విధ్వంస ప్రభావం

పెరుగుతున్న రక్షణ వ్యయాలు

ప్రపంచం ఎదుర్కొంటున్న బహుళ సంక్షోభానికి సంకేతాలే తరచుగా సంభవిస్తున్న అగ్నిప్రమాదాలు, వర దలు, ఘర్షణలు. విశ్వంలో ఆర్థిక వ్యవస్థ పరిమితమైనది. అలాగే రాజకీయ నాయకుల దార్శినికత, ప్రజల దూరదృష్టి కూడా పరిమితమే. ఒకవైపు వాతావరణ విపత్తులు, ఇంకో వైపు భౌగోళిక ఘర్షణలు, మరోవైపు భద్రతా వ్యయం వలన ఈ ఏడాది ప్రపంచం మూడు దిశల్లో తీవ్ర ఒత్తిడిని ఎదు ర్కొంటోంది. అసలు సమస్య ఏమిటంటే, ఇలాంటి విపత్తు లన్నీ ఒకేసారి సంభవించినప్పుడు పరిమిత ఆర్థిక వనరులు కోసం అవి ఒకదానితో ఒకటి పోటీ పడాల్సి రావడమే. దుకే విశ్లేషకులు ఇప్పుడు బహుళ సంక్షోభం (పాలీ క్రైసిస్) అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. అంటే ఒకే సమయంలో అనేక సంక్షోభాలు సంభవించడం, వాటిలో ప్రతి ఒక్కదా నీ తక్షణ స్పందన అవసరం కావడం. రక్షణ వ్యయాలు పెరుగుతుండటంతో వాతావరణ మార్పుల నివారణకు అవసరమైన నిధులు తగ్గిపోతున్నాయి. అయితే వాతావ రణ మార్పు సమస్యను ఇక పక్కన పెట్టడం సాధ్యం కాదు. ఇటీవల సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాలు దానిని మళ్లీ ప్రపంచ చర్చల కేంద్రంగా నిలిపాయి.

పర్యావరణ విధ్వంస ప్రభావం

ప్రపంచ సగటు పెరుగుదల కంటే రెండు రెట్లు వేగంగా యూరోప్ ఖండం వేడెక్కుతోంది. ఈ ఏడాది జూన్ నెలలో నమోదైన అత్యంత వేడి ఉష్ణోగ్రతలు ఇప్పటికే వాతావరణ మార్పుల తీవ్రతను సూచిస్తున్నాయి. జులై మధ్యలో దక్షిణ స్పెయిన్లోని ఒక చిన్న పట్టణం అల్మేరి యాలో సంభవించిన దావానలం కనీసం 12 మంది ప్రాణా లను బలిగొంది, 23 మందికి పైగా గల్లంతయ్యారు. ఇదే సమయంలో, కెనడాలోని విపరీతమైన అటవీ అగ్నిప్రమా లక్షలాది హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని దహనం చేశా యి. కేవలం జూన్ 21 నుంచి తొమ్మిది రోజుల్లోనే ఐరోపాలో ఎండల దెబ్బకు పదమూడు వేలకు పైగా అదనపు మర ణాలు నమోదయ్యాయి. జూన్ 28న నెదర్లాండ్స్ దేశంలో ఇరవై నాలుగు గంటల్లో మూడు లక్షల పిడుగులు పడ్డాయి. పది లక్షల హెక్టార్లు పైగా విధ్వంసంతో 2025 తరువాత యూరోపియన్ యూనియన్లో అత్యంత తీవ్రమైన అగ్ని ప్రమాదాల కాలంగా 2026వ సంవత్సరం నమోద య్యింది. పర్యావరణ మార్పుల ప్రభావానికి అత్యంత ఎక్కువగా లోనవుతున్న యూరప్ ఖండం పరిస్థితి సమీప భవిష్యత్తులో పెనం నుండి పొయ్యిలో పడ్డ చందంగా మారనుందని, ఇదంతా రెండు దశాబ్దాలకు పైగా పర్యావరణంతో యథేచ్ఛగా చెలగాట మాడగా వచ్చిన ఫలితమని కోపర్నికస్ క్లైమేట్ ఛేంజ్ సర్వీ సెస్, ప్రపంచ వాతావరణ సంస్థ సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో హెచ్చరించారు. వరదల ప్రభావానికి యూరప్లో ముప్ఫై శాతం నదుల అనుసంధానత దెబ్బతింది. “ఉష్ణోగ్రతల పరంగా యూరప్ ఇప్పటికే నిప్పుల కుంపటిపై కూర్చున్నట్లు లెక్క. ఇకనుంచి పెరిగే ప్రతి డిగ్రీ ఉష్ణో గ్రత ఆ ఖండం మొత్తాన్ని వినాశనం వైపు నెడు తుంది” అని డబ్లుఎంఓ ప్రధాన కార్యదర్శి సెలెర్జీ సావ్లో హెచ్చరించారు. ఇక చైనాలో మరో విధమైన తీవ్ర విధ్వం సాన్ని వరదలు సృష్టించాయి. ‘బావి’ తుఫాను విపత్తు వలన జెజియాంగ్ ప్రావిన్స్లో సుమారు 2.2 మిలియన్ మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. తీర నగరం క్విన్లో దాదా పు 1,300 చెట్లు నేల కూలగా, 700కు పైగా పూర్తిగా వేర్లతో సహా పెకిలిపోయాయి. ఇదే తుఫాను ప్రభావంతో కొండ చరియలు విరిగి పడటం వలన దక్షిణ ఫిలిప్పీన్ దేశంలో 17 మంది మరణించగా, తైవాన్ దేశంలో 130 మందికి పైగా గాయాల పాలయ్యారు. కొద్ది రోజుల వ్యవధిలోనే ఒక ప్రాంతంలో తీవ్ర అగ్ని ప్రమాదాలు, మరో ప్రాంతంలో వరదలు, తుఫానులు వరుసగా సంభవి స్తున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావంతో ఇలాంటి సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు సర్వ సాధార

పెరుగుతున్న రక్షణ వ్యయాలు

ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక మార్కెట్లు కూడా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం వలన బ్రెంట్ ముడి చమురు ధరలో పెరుగుదల వలన విమాన టికెట్ల ధరల నుంచి రైతులు ఉపయోగించే ఎరువుల ధరల వరకు అన్నింటిపైనా ప్రభావం పడింది.

ఇటీవల నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల వలన రాజకీయ నాయకుల దృష్టి, నిధులు కూడా రక్షణ వ్యయా లపైనే కేంద్రీకృతమవుతున్నాయి. అమెరికా 2026లో రక్షణ కోసం 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు పైగా ఖర్చు చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే 2027 ఆర్థిక సంవత్సరానికి 1.5 ట్రిలియన్ డాలర్ల ప్రతిపాదనను వైట్ హౌస్ ప్రకటించింది. కాంగ్రెస్ దీనికి ఆమోదం తెలి పితే, అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద సైనిక వ్యయంగా నిలుస్తుంది. గతేడాది నాటో దేశాలు తమ రక్షణ వ్యయా లను జీడీపీలో 5 శాతానికి పెంచాలని నిర్ణయించాయి. పోలాండ్ ఇప్పటికే తన జీడీపీలో 5 శాతానికి సమానమైన మొత్తాన్ని రక్షణ రంగానికి కేటాయిస్తోంది. జర్మనీ తన సైని కవ్యయాలను పరిమితం చేస్తున్న రాజ్యాంగ నిబంధనలను సడలించింది. చైనా ఈ ఏడాది తన రక్షణ బడ్జెట్ ను 7శాతం పెంచింది. జపాన్ ప్రభుత్వం 2026 నాటికి తన రక్షణ వ్యయాన్ని 9.4 శాతం పెంచాలని నిర్ణయించింది. దేశాలు తమ జాతీయ భద్రతను బలోపేతం చేసుకోవాలనే ఆలోచన సమంజసమైనదే. కానీ దీని వల్ల వాతావరణ మార్పులపై చర్యలకు కేటాయించాల్సిన నిధులు తగ్గిపోతున్నాయి. వాతా వరణ విపత్తుల కారణంగా నష్టపోయిన పేద దేశాలకు సహాయం చేయడానికి ఏర్పాటు చేసిన లాస్ అండ్ డ్యా మేజ్ ఫండ్” ఈ ఏడాది పంపిణీ చేయడానికి కేవలం 250 మిలియన్ అమెరికన్ డాలర్ల నిధులను మాత్ర మే కలిగి ఉంది. ప్రపంచంలో నిధుల కోసం జరుగుతున్న పోటీలో వాతావరణ మార్పుల నివారణ కార్యక్రమాలు తరచుగా వెనుకబడిపోతున్నాయి.

అన్ని లేరియా, జెజియాంగ్, నెద ర్లాండ్ వంటి విపత్తులను ఎదుర్కొనడం లేదు. ప్రపంచ మీడియా కూడా కొద్ది రోజుల పాటు మాత్ర ఈ వార్తలకు ప్రాధాన్యత ఇస్తుంది. అంతకుముందు జరిగిన చిన్న చిన్న వరదలు, తుఫానులు, ఎండల ప్రభావం ఇప్పటికే వార్త నుండి కనుమరుగై ఉండవచ్చు. కానీ ఇవన్నీ ఒకే దిశను సూచిస్తున్నాయి. ప్రస్తుతం విప తులను సురక్షిత దూరం నుంచి వీక్షిస్తున్న దేశాలకు, వాటి ప్రభావాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తున్న దేశాలకు మధ్య తేడా కేవలం సమయానికి సంబంధించినది మాత్రమే. ఇది ప్రపంచాంతానికి సంబంధించిన హెచ్చరిక కాదు. కానీ ఇది సమయాన్ని గురించి చెప్పే గంభీరమైన సందేశం. ఇంకా విపత్తులను దూరం నుంచి చూస్తున్న దేశాలకు ముందస్తుగా సిద్ధమయ్యే అవకాశం ఉంది. కానీ ప్రతి కొత్త విపత్తుతో ఆ అవకాశం మరింత కుంచించుకుపోతోంది. ప్రపంచం తన సంపదను ఎక్కువగా యుద్ధ సన్నాహాలకు ఖర్చు చేస్తూ, విపత్తుల తర్వాత స్పందించడం కంటే ముందస్తు సన్నద్ధ తకు తక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. వాతావరణ సంక్షోభం ఎవరి సమస్యో కాదు; అందరి సమస్యగా మారే సమయానికి నష్టాన్ని పూడ్చుకోవడం మరింత ఖరీదైన వ్యవహా రమవుతుంది. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు పర్యావరణ రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తే మానవాళికి రాబోయే సంక్షోభాన్ని నివారించిన వారవుతారు.

  • లింగమనేని శివరామ ప్రసాద్