బాబావలి సతీమణి మృతి.. విక్కుర్తి శ్రీనివాసరావు సంతాపం

అవనిగడ్డ, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్‌ కార్యనిర్వాహక కార్యదర్శి షేక్‌ బాబావలి సతీమణి అమీరున్నిసా అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి విక్కుర్తి శ్రీనివాసరావు ఆదివారం ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

అనంతరం బాబావలి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అమీరున్నిసా మృతి కుటుంబ సభ్యులకు తీరని లోటని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని అమీరున్నిసాకు నివాళులర్పించారు.