నిరుద్యోగులకు, యువతకు అండగా వైసీపీ…
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వెంటనే కల్పించాలి
నిరుద్యోగ భృతి వెంటనే అమలు చేయాలి
నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి
తన్నీరు నాగేశ్వరరావు
జగ్గయ్యపేట, ఆగస్టు 8 (ఆంధ్రప్రభ ) : నిరుద్యోగులకు యువతకు వైకాపా పార్టీ అండగా ఉంటుందని జగ్గయ్యపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తన్నీరు నాగేశ్వరరావు అన్నారు. శనివారం జగ్గయ్యపేట పట్టణంలోని పాత మున్సిపల్ సెంటర్లో డీఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో వైకాపా నేత తన్నీరు నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మూడవరోజు దీక్షలో పాల్గొన్న వత్సవాయి మండలం జగ్గయ్యపేట మండలాలకు చెందిన విద్యార్థులు నిరుద్యోగులు నాగేశ్వరావు కొద్దిసేపు మాట్లాడారు ఈ సందర్భంగా తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ… నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో విప్లమైనట్లు ఆరోపించారు.
నిరుద్యోగ భృతి హామీ వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. సోమవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయిలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు విద్యార్థులు నిరుద్యోగులు యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట మండల పార్టీ అధ్యక్షుడు బూడిద నరసింహారావు వత్సవాయి మండల పార్టీ అధ్యక్షుడు గుత్తా శంకర్రావు యువత పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
