Ampl-Launches : ఏపీలో పికిల్ బాల్ సంద‌డి Andhra Prabha Sports News

Ampl-Launches : ఏపీలో పికిల్ బాల్ సంద‌డి Andhra Prabha Sports News

  • ప్రారంభించిన మంత్రి మ‌డింప‌ల్లి

(ఆంధ్ర‌ప్ర‌భ‌, విజ‌య‌వాడ )

Ampl-Launches : ఏపీలో తొలిసారిగా నిర్వహిస్తున్న అమరావతి పికిల్‌బాల్ లీగ్ (AMPL) ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. విజయవాడలోని నైట్రో పికిల్‌బాల్ అండ్ కేఫే వేదికగా ఈ నెల 9వ తేదీ వరకు ఈ లీగ్ పోటీలు జరగనున్నాయి. రాష్ట్రంలో పికిల్‌బాల్ క్రీడ అభివృద్ధికి ఈ లీగ్ ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంచేందుకు, పికిల్‌బాల్ వంటి నూతన క్రీడలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు.విజయవాడ ఎమ్మెల్యే గద్దె రామోహన్నాయుడు, శాప్ చైర్మన్ రవి నాయుడు, సినీహీరో సుశాంత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.