Ramayan | రిలీజ్ డెట్, టైమ్ ప్రకటించిన చిత్రబృందం
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: భారతీయ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘రామాయణ’ చిత్రం నుంచి కీలక ప్రకటన వెలువడింది. సినిమా ట్రైలర్ విడుదలకు సంబంధించిన తేదీ, సమయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఆధ్యాత్మికతకు ప్రతీకగా భావించే బ్రహ్మ ముహూర్తంలోనే ట్రైలర్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించింది.
జూలై 30న ఉదయం 4:15 గంటలకు ట్రైలర్ విడుదల కానుంది. కాగా ఇప్పటికే విడుదల కావాల్సిన ట్రైలర్ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. అయితే, ఈ ప్రకటనతో సినిమా అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.
ఇప్పటికే ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో రణబీర్ కఫూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, రావణుడిగా యష్ నటించారు. చిత్రానికి నితీష్ తివారీ దర్శకత్వం వహించారు.
కాగా ఈ చిత్రం దాదాపు రూ. 4000 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడుతోంది. నిర్మాత నిమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, యష్‌కు చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, చార్లెస్ రోవన్ కు చెందిన అమెరికన్ స్టూడియో అట్లాస్ ఎంటర్టైన్మెంట్, అలాగే సోని సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి భాగాన్ని నవంబర్ 6, 2026 దీపావళికి విడుదల చేయనున్నారు.
ఆధునిక సాంకేతికత, అద్భుతమైన విజువల్స్, భారతీయ ఇతిహాసాన్ని భారీ స్థాయిలో ఆవిష్కరించే ప్రయత్నంగా ఈ సినిమా రూపొందుతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో జూలై 30 ఉదయం విడుదల కానున్న ఈ ట్రైలర్‌పై దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల దృష్టి నెలకొంది.

