ప్రతి సంవత్సరం మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా ఎర్త్ అవర్ జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యుడబ్ల్యుఎఫ్) ఎర్త్ అవర్ గ్లోబల్ ఉద్యమంలో భాగంగా రేపు (శనివారం) ఒక గంట పాటు అనవసరమైన లైట్లను స్వచ్ఛందంగా ఆపేసి ఎర్త్ అవర్ పాటించాలని ఏపీ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
రాత్రి 8.30గంటల నుంచి 9.30గంటలకు డబ్ల్యుడబ్ల్యుఎఫ్ ప్రపంచ వ్యాప్తంగా గంటపాటు అనవసరమైన లైట్లను స్వచ్ఛందంగా ఆపేయడం ద్వారా వాతావరణ పరిరక్షణ ఉద్యమంలో ప్రజలను ఏకం చేస్తూ భవిష్యత్ తరాలకు మెరుగైన ప్రపంచాన్ని అందించడంలో సహాయపడుతుందని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు.
కాగా.. ఎర్త్ డేను పాటిస్తూ తెలంగాణ ప్రభుత్వం సచివాలయంలో రేపు రాత్రి గంట సేపు లైట్లను ఆపేయనుంది.