పెద్ది సుదర్శన్‌రెడ్డిని పరామర్శించిన చల్లా ధర్మారెడ్డి

ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే

పరకాల, ఆంధ్రప్రభ : నర్సంపేట బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు. సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో చల్లా ధర్మారెడ్డి ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు.

అనంతరం పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షించారు.