పబ్బతి ఆంజనేయుడి సన్నిధిలో మంత్రి లక్ష్మణ్, ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రత్యేక పూజలు

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణలకు ఘన స్వాగతం

పబ్బతి ఆంజనేయుడి సన్నిధిలో మంత్రి లక్ష్మణ్, ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రత్యేక పూజలు
అచ్చంపేట జూలై ఆంధ్రప్రభ : పదర మండలం, మద్దిమడుగు గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య స్వామివారి తీర్థప్రసాదాలను అందించి, శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం మంత్రి, ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, రైతులకు సమృద్ధిగా పంటలు పండాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామిని ప్రార్థించారు. ఆలయానికి విచ్చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణలకు ఆలయ చైర్మన్ దేశవతు రాములు నాయక్, పాలకమండలి సభ్యులు, గ్రామస్థులు, భక్తులు ఘన స్వాగతం పలికారు.