అప్పుడు పారిపొతే.. ఇప్పుడు వెంటపడుతున్నారు..
ఏపీలో పెట్టుబడులపై మంత్రి కామెంట్
సీఎం సీబీఎన్ విజన్ మరువలేం
ఏపీలో ఉత్తరాంధ్ర అతి పెద్ద ఆర్తిక వ్యవస్థ
రూ.6వేల కోట్ల పెట్టుబడితో..
ఉత్తరాంధ్రాలో 189 ప్రాజెక్టులు
ఆగస్టు 1న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభం
ముఖ్య అతిథి ప్రధాని మోదీ
( ఆంధ్రప్రభ, విజయనగరం బ్యూరో ) : ఇక ఉత్తరాంధ్ర ఏపీకి అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా మారనుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు,గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్ధ సారధి అన్నారు. భోగాపురంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆగస్ట్ 1న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ తెలుగు జాతి ఎప్పటికీ మరిచిపోదు ఉత్తరాంధ్ర జిల్లాల ఆర్థిక అభివృద్ధికి ఒక అధ్యాయంగా మారనుంది.
ఇన్వెస్టర్స్ పెద్దఎత్తున చర్చించుకుంటున్నారు. ఏపీ అంటే పారిపోయిన పెట్టుబడిదారులు ఇప్పుడు మళ్లీ ఏపీ ప్రభుత్వం వెంట పడుతున్నారు. లోకేష్ తన వ్యక్తిగత పరిచయాలతో పెద్దఎత్తున సాఫ్ట్వేర్ కంపెనీలను తీసుకువస్తున్నారు. భవిష్యత్తులో భోగాపురం ఎయిర్ పోర్ట్ మరింత విస్తరించనుంది. ఏపికి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉత్తరాంధ్ర మారనుంది. ఉత్తరాంధ్రలో 189 కొత్త ప్రాజెక్టులను ఆరు వేల కోట్లకు పై పెట్టుబడులతో ప్రారంభించారు. ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి.
