కళ్ళకు గంతలు కట్టి లేఖర్ల నిరసన
నర్సాపురం, ఆంధ్రప్రభ: రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్లు చేపట్టిన పెన్ డౌన్ కార్య క్రమం 8వ రోజుకు చేరింది. నర్సాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో సోమవారం దస్తావేజు లేఖర్లు కళ్ళకు గంతలు కట్టుకుని వినూత్న పద్ధతిలో నిరసన వ్యక్తం చేశారు. అక్కడ గంటసేపు నినాదాలు చేసి పట్టణ పురవీధులు గుండా ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ సెంటర్ కు చేరుకున్నారు. అంబేద్కర్ కు పూలదండ వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విగ్రహం వద్ద వినతి పత్రం ఉంచి ప్రభుత్వ మనస్సు మారాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ.. బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతున్న దస్తావేజు లేఖర్లు వృత్తి పై తెలుగు దేశం పార్టీ కక్ష కట్టిందని, అధికారం లోకి వచ్చిన ప్రతీసారి రిజిస్ట్రేషన్ శాఖ లో కంప్యూటరీకరణ పేరుతో లేఖర్లు వృత్తి కి అవరోధం కలిగించే లా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సారి కూడా లేఖర్లు వృత్తిని హరించే విధంగా జీ ఓ 396ను తీసుకువచ్చి రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి తమ పొట్ట కొట్ట డానికి చూస్తోందన్నారు.
గత ఎనిమిది రోజులుగా పెన్ డౌన్ చేసి నిరసన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదని అవేదన వ్యక్తం చేశారు. అవసరం అయితే రాష్ట్ర పిలుపు మేరకు ఆగస్టు 1నుంచి నిరహార దీక్షలు చేపట్టడానికి లేఖర్లు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో తెలగంశెట్టి సత్యనారాయణ, కోయ చింతారావు, దిడ్ల నాగరాజు, టి వి రమణ, ఈశ్వర్,జీ రవి రామారావు, కె శ్రీనివాస్, కే రామ చంద్రరావు, మోహన్ , శ్రీరామమూర్తి, రవి, సాయి, రాజు, పెద్దిరాజు, బాబ్జీ, భోగేశ్వర రావు, కె సత్య నారాయణ, సత్య కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
