రైతు సంక్షేమానికి మరో అడుగు
ఉప్పరపల్లిలో ఫార్మ్ పాండ్‌కు భూమిపూజ
అచ్చంపేట, ఆంధ్రప్రభ: వ్యవసాయానికి నీటి వనరులు మెరుగుపరిచి రైతులకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో ఉప్పరపల్లి గ్రామంలో సోమవారం రైతు పొలంలో ఏర్పాటు చేయనున్న ఫార్మ్ పాండ్‌కు భూమిపూజ నిర్వహించారు.
గ్రామ సర్పంచ్ బొజ్జ గీత అమరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీనివాస్ చారి, గ్రామ కార్యదర్శి ప్రదీప్ రావు, ఎన్‌ఆర్‌ఈజీఎస్ అధికారి ఉమాపతి పాల్గొని పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ బొజ్జ గీత అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఫార్మ్ పాండ్‌ల ఏర్పాటు వల్ల వర్షపు నీటిని నిల్వ చేసుకొని వ్యవసాయ అవసరాలకు వినియోగించుకోవచ్చని తెలిపారు.
ఫార్మ్ పాండ్‌ల ద్వారా భూగర్భ జలాల మట్టం పెరగడంతో పాటు రైతులకు సాగునీటి ఇబ్బందులు తగ్గుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఉపాధి హామీ పథకం పనులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు భారతమ్మ, లక్ష్మి, రేనమ్మ, సువర్ణ, వెంకటయ్య, పర్వతాలు, గ్రామస్తులు సురేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
