కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
మండల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
గండిడ్, ఆంధ్రప్రభ: మండల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ టి. రామ్మోహన్ రెడ్డి అన్నారు.
మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం మండల స్థాయి అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు అందుతున్న సేవలను శాఖల వారీగా సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న పనులను పరిశీలించి నిర్ణీత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
శాఖల మధ్య సమన్వయంతో పనిచేస్తూ ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, ప్రభుత్వ సేవలు ప్రజలకు సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై బీఎల్‌ఓలు, సర్పంచులు, కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్యే అవగాహన కల్పించారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటరు వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఓటరు నమోదు ప్రక్రియ పారదర్శకంగా, సమర్థవంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు.
అనంతరం రెడ్డిపల్లి గురుకుల పాఠశాలలో ప్రధానమంత్రి జన్‌మన్ పథకం కింద రూ.70 లక్షలతో మంజూరైన డైనింగ్ హాల్‌కు భూమిపూజ చేశారు. అలాగే అంచన్‌పల్లి గ్రామంలో గ్రామపంచాయతీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ వెంకట ఉపేందర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కమతం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అనంత లక్ష్మారెడ్డి, ఎంపీడీవో మంజుల, డిప్యూటీ తహసీల్దార్ రాజగోపాల్, ఏవో రాధమ్మ, ఏపీఎం రజిత, సర్పంచుల సంఘం అధ్యక్షుడు భగవంతు రెడ్డి, పీసీసీ మెంబర్ నరసింహారావు, సర్పంచులు చెన్నయ్యపల్లి తండా సర్పంచ్ దశరథ్ నాయక్, చెన్నారెడ్డి, వీరన్న, టీకే నాయక్, లక్ష్మారెడ్డి, గుర్రాల నవనీత, రామచంద్ర, సుజాత, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
