బాధిత చిన్నారికి దాతల ఆర్థిక సాయం

చిట్యాల, ఆంధ్రప్రభ: మండలంలోని వెంకట్రావుపల్లి (సి) గ్రామానికి చెందిన మాసు అనిల్, సింధు దంపతుల కుమారుడు చిన్ని ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

పది రోజుల క్రితం చిన్నారికి స్నానం చేయిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు వేడి నీళ్లు పడడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. నిరుపేద కుటుంబానికి చెందిన చిన్నారి వైద్య ఖర్చుల కోసం సాయం చేయాలని సామాజిక మాధ్యమాల ద్వారా కోరారు.

దీనికి స్పందించిన దాతలు రూ.25 వేల ఆర్థిక సాయాన్ని అందించారు. సోమవారం ఆసుపత్రిలో బాధిత కుటుంబానికి ఈ మొత్తాన్ని చిట్యాల మాజీ ఎంపీటీసీ దబ్బేట అనిల్ అందజేశారు.

ఈ సందర్భంగా దబ్బేట అనిల్ మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.