సత్తెనపల్లి డీఎస్పీగా ఎం.వి.కె. చైతన్య..

సత్తెనపల్లి టౌన్, ఆంధ్రప్రభ : సత్తెనపల్లి నూతన డీఎస్పీగా నియమితులైన ఎం.వి.కె. చైతన్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఎం.వి.కె. చైతన్య మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల పై రాజీ లేకుండా చర్యలు తీసుకుంటామని, ప్రజలు నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలని కోరారు. ప్రజల సహకారంతో నేరాల నియంత్రణకు కృషి చేస్తూ, సమర్థవంతమైన పోలీసింగ్ అందించేందుకు కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు.