బాధిత కుటుంబానికి రూ.3 లక్షల ఎల్ఓసీ అందజేత
ఆపదలో ఆదుకునే వారే నిజమైన నాయకులు
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్‌గల్ మండలం పల్లికొండ గ్రామానికి చెందిన చిలివేరి నాగేష్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
వైద్యులు ఆపరేషన్ చేయాలని సూచించడంతో వైద్య సహాయం కోసం పల్లికొండ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్‌ను సంప్రదించారు.
దీంతో ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.3 లక్షల ఎల్ఓసీని మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.
ఆపద సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన ముత్యాల సునీల్ కుమార్‌కు బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆపదలో ఆదుకునే వారే నిజమైన నాయకులని పేర్కొన్నారు.
