వర్షాభావంతో ఆరుతడి పంటలు వేసుకోవాలి..
మంచిర్యాల ఏడీఏ కృష్ణ..
జన్నారం, ఆంధ్రప్రభ : వర్షాభావం ఉన్నందున అరుతడి పంటలు వేసుకోవాలని మంచిర్యాల డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకుడు(ఏడీఏ ) ఎం. కృష్ణ తెలిపారు.మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని పొనకల్ రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం విత్తనమేల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎల్ నీనో వల్ల తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నయన్నారు.
రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు వేసుకోవాలని, వరి వేసుకోవడం వల్ల పంట చివరి దశలో నీరు సరిపోక పంట నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు జొన్న, పెసర, కంది, మినుములపంటలు వేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అజ్మీర నందు నాయక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రం మోహన్ రెడ్డి, జిల్లా నాయకుడు మచ్చ శంకరయ్య, పార్టీ టౌన్ అధ్యక్షుడు మంద రాజేశ్, మండల వ్యవసాయాధికారి సోదారి వీరన్న, ఏఈఓలు సయ్యద్ అక్రముల్ల, బాదావత్ అఖిల్ నాయక్, కాండ్రపు లవన్, కె.దివ్య, కృషి సఖీలు అంజలి, రజిత, రైతులు పాల్గొన్నారు.
