హైకోర్టు కీల‌క ఆదేశం

చీఫ్ సెక్రటరీకి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
అర్హత కలిగిన అధికారిని నియమించాలని స్పష్టం

హైదరాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ‌: హైడ్రా (HYDRAA) కమిషనర్ ఏ.వి. రంగనాథన్‌ను ఆ పదవి నుంచి తొలగించి, అర్హత కలిగిన అధికారిని నియమించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ) అవసరమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది.

హైడ్రా కమిషనర్‌గా రంగనాథన్ నియామకం, విధుల నిర్వహణకు సంబంధించిన అంశాలపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ నిర్ణయం వెలువరించింది. కమిషనర్ పదవికి అర్హత కలిగిన అధికారిని నియమించి, చట్టబద్ధ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇటీవలి కాలంలో హైడ్రా చర్యలు, అధికార పరిధి, కోర్టు ఆదేశాల అమలుకు సంబంధించిన వివాదాల నేపథ్యంలో హైకోర్టు ఈ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టాల్సి ఉంది.