శస్త్రచికిత్స బాధితుడికి రూ.12 వేల ఆర్థిక సాయం

మోత్కూర్, ఆంధ్రప్రభ: మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్‌కు చెందిన కూరేళ్ల పరుశురాం సెంట్రీ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు భవనం పై నుంచి పడిపోవడంతో కాలుకు తీవ్ర గాయమై శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయనకు ‘మన మోత్కూర్’ వాట్సాప్ గ్రూప్ దాతలు, సభ్యులు అందించిన రూ.12 వేల ఆర్థిక సహాయాన్ని పట్టణ ఆర్యవైశ్య సంఘం, చేనేత సహకార సంఘం అధ్యక్షులు మొగుల్లపల్లి సోమయ్య, వంగరి రాములు, జిల్లా అక్రిడేషన్ సభ్యుడు వెల్మినేటి జహంగీర్ చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా ‘మన మోత్కూర్’ వాట్సాప్ గ్రూప్ సామాజిక సేవలో ముందంజలో ఉండడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కారుపోతుల వెంకన్న, గ్రంథాలయ చైర్మన్ కోమటి మచ్చగిరి, వాట్సాప్ గ్రూప్ ప్రతినిధులు ధబ్బేటి సోంబాబు, ఎం.డి. షాకీర్, చోల్లేటి నరేశ్, మొరిగాల శ్రీను, కోమటి జనార్దన్, మురారి శెట్టి శ్రీను, బందెల శ్రీను తదితరులు పాల్గొన్నారు.