మృతుడి కుటుంబానికి మున్సిపల్ యూనియన్ ఆర్థిక సహాయం
భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ: భీంగల్ మున్సిపాలిటీలో ఔట్‌సోర్సింగ్ విధానంలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న కోట నర్యయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో భీంగల్ మున్సిపల్ యూనియన్ నాయకులు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం యూనియన్ తరఫున రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ యూనియన్ అధ్యక్షుడు సున్నపు ఓంకార్ మాట్లాడుతూ, కోట నర్యయ్య కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరారు. వారి కుటుంబానికి యూనియన్ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు పల్లికొండ శ్రీధర్, పతాని నవీన్, బచ్చల వారి విశ్వనాథ్, జంబుక రాజారాం, సిబ్బంది పాల్గొన్నారు.
రూ.పదివేల ఆర్థిక సాయం
భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ: భీంగల్ మున్సిపాలిటీలో ఔట్‌సోర్సింగ్ విధానంలో ఎలక్ట్రిషన్‌గా విధులు నిర్వహిస్తున్న కోట నర్సయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో, ఆయన కుటుంబ సభ్యులను భీంగల్ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి బోదిరే నాగమణి స్వామి, మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్, కౌన్సిలర్లు పరామర్శించారు. ఈ సందర్భంగా నర్సయ్య అంత్యక్రియల నిర్వహణ కోసం మున్సిపాలిటీ తరఫున రూ.10,000 ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతుడి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు తోట సతీష్, అంజుమ్ అలీ, సందీప్, ప్రజాప్రతినిధులు జేజే నర్సయ్య, కన్నె సురేందర్, ఆరేపల్లి నాగేంద్ర, బోదిరే నర్సయ్య, అనంతరావు తదితరులు పాల్గొన్నారు.

