ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, ఆంధ్రప్రభ: కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తనిఖీ చేశారు. గోడౌన్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల భద్రతా వ్యవస్థను పరిశీలించి, ఈవీఎం గోడౌన్‌కు వేసిన భద్రతా సీలు, సీసీ కెమెరాల పనితీరు, అగ్నిమాపక పరికరాల పరిస్థితిని పరిశీలించారు. అనంతరం తనిఖీ వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేసి సంతకం చేశారు.