పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని..
నల్లబెల్లి, ఆంధ్రప్రభ: నల్లబెల్లి మండలంలోని నారక్కపేట గ్రామంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అనారోగ్యం నుంచి త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ ప్రజా సేవలో చురుకుగా పాల్గొనాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు 101 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని సామూహికంగా ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దండం సంపత్, ఉపసర్పంచ్ సురబోయిన రాంబాబు, మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ, ఆయన త్వరగా కోలుకుని ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షించారు.
