బెస్ట్ అవైలబుల్ స్కీం విద్యార్థులకు అడ్మిషన్ పత్రాల అందజేత
మోత్కూర్, ఆంధ్రప్రభ: బెస్ట్ అవైలబుల్ స్కీంలో గత నెల నిర్వహించిన డ్రా ద్వారా ఎంపికైన విద్యార్థులకు శనివారం అడ్మిషన్ పత్రాలను అందజేశారు. మోత్కూర్లో నిర్వహించిన కార్యక్రమంలో సూపరింటెండెంట్ జ్యోతిర్మయి, జూనియర్ అసిస్టెంట్ రూప విద్యార్థుల తల్లిదండ్రులకు అడ్మిషన్ పత్రాలు అందించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు తొంట యాదగిరి, ఇటికాల సైదులు, శ్రీను, శేఖర్, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
