గుడివాడలో సీఎం చంద్రబాబు పర్యటన
- ప్రజావేదిక సభతో పాటు విద్యార్థులు, టీడీపీ నేతలతో సమావేశాలు
అమరావతి, ఆంధ్రప్రభ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం (జూలై 18) కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటించనున్నారు. ప్రజావేదిక సభలో పాల్గొనడంతో పాటు విద్యార్థులతో సమావేశం, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహించనున్నారు.
అధికారిక షెడ్యూల్ ప్రకారం… ఉదయం 10 గంటలకు అమరావతిలోని క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరనున్న ముఖ్యమంత్రి, 10.20 గంటలకు గుడివాడలోని ఏఎన్‌ఆర్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. అనంతరం 10.40 గంటలకు ఎన్టీఆర్ గ్రౌండ్‌కు చేరుకుని, 10.45 గంటలకు అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
మధ్యాహ్నం 12.55 గంటలకు కేకేఆర్ గౌతమ్ స్కూల్‌కు వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు యలవర్తి గ్రౌండ్స్‌కు చేరుకుని గుడివాడ నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 4.05 గంటలకు ముఖ్యమంత్రి తిరిగి క్యాంప్ కార్యాలయానికి చేరుకోనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో గుడివాడలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టగా, భద్రతను కట్టుదిట్టం చేశారు.
