హైదరాబాద్‌లో వర్షాలు.. మరో గంటన్నరలో ఈ ప్రాంతాల్లో వ‌ర్షం..

హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌లో వర్షాలు జోరందుకున్నాయి. శుక్రవారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఎండల నుంచి నగరవాసులకు కాస్త‌ ఉపశమనం లభించింది. న‌గ‌రంలోని శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, కొండాపూర్, ఆర్‌సీ పురం, మాదాపూర్, షేక్‌పేట్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తరు వర్షపాతం నమోదైంది. వర్షానికి పలు చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది.

వాతావరణ పరిస్థితులను బట్టి రానున్న గంటన్నరలో నగర మధ్య ప్రాంతాలైన అమీర్‌పేట్, జూబ్లీహిల్స్, టోలీచౌకి, మెహిదీపట్నం, ఖైరతాబాద్, నాంపల్లి తదితర ప్రాంతాలకు వర్షాలు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ వర్గాలు తెలిపాయి. అప్రమత్తంగా ఉండాలని అధికారులు నగరవాసులకు సూచిస్తున్నారు.