అర్హతలు లేకుండా అలోపతి వైద్యం.. క్లినిక్ సీజ్
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: ఉరవకొండ పట్టణంలోని అఫ్రీన్ క్లినిక్ లో అర్హతలేని వ్యక్తి ఆలోపతి వైద్యం చేస్తున్నారని ఫిర్యాదు రావడంతో, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.బి దేవి, జిల్లా ట్రైనింగ్ కలెక్టర్ షియాజ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం అఫ్రీన్ క్లినిక్ ను ఆకస్మిక తనిఖీ చేసి, రికార్డును పరిశీలించి సీజ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ.. అర్హతలు లేకుండా ఆలోపతి వైద్యం అందించి రోగుల అనారోగ్యంతో చెలగాటమాడితే పోలీసు కేసులు కూడా పెడతామని హెచ్చరించారు. ప్రథమ చికిత్స కేంద్రం పేరుతో వైద్యం అందిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి నాగరాజు, ఉరవకొండ ప్రభుత్వాసుపత్రి వైద్యాధికారి డాక్టర్ వినీత, డిప్యూటీ డెమో లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
