ఈనెల ఆఖరి వరకు గడువు పెంచాలి : ఏడిఏ
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : ప్రీమియం చెల్లించడానికి ఈ నెల 31వ తేదీ వరకు గడువు పెంచాలని ఉరవకొండ వ్యవసాయ డివిజన్ సహాయ సంచాలకులు సత్యనారాయణ బ్యాంక్ అధికారులకు
కోరారు. శుక్రవారం పట్టణంలోని కెనరా బ్యాంక్ మేనేజర్ శివ దుర్గ ప్రసాద్, బ్యాంక్ అధికారులతో ఏ డి ఏ సత్యనారాయణ చర్చించారు. ఈ సందర్భంగా ఏడిఏ సత్యనారాయణ మాట్లాడుతూ పంటల
భీమాపై పునర్వ్యవస్థీకరిం చిన వాతావరణపంటల బీమా మరియు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం వాటి క్రింద నమోదైన వివిధ పంటలు, రైతులు చెల్లించవలసిన ప్రీమియం, ఈనెల 31 తేదీ వరకు గడువు ఇవ్వాలన్నారు.
పంట ఋణం పొందని నాన్ లోని రైతులు వారు వేసిన పంటను బట్టి ప్రీమియంను కామన్ సర్వీస్ సెంటర్, మీసేవ కేంద్రాల్లో ఈనెల 31 తేదీలోగా ఆధార్ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం, స్వయం ధ్రువీకరణ పత్రం సమర్పించి చెల్లించాలన్నారు. పంట వేసిన ప్రతి రైతు భీమా పొందాలంటే, ఈ పంట నమోదు తప్పక చేసుకోవాలన్నారు. కంది ఒక ఎకరాకు 80 రూపాయలు, మిరప ఒక ఎకరాకు 576 రూపాయలు, జొన్నలు ఒక ఎకరాకు 84 రూపాయలు, మొక్కజొన్న ఒక ఎకరాకు 132 రూపాయలు, వరి పంట ఒక ఎకరాకు 164 రూపాయలు, ఆముదం ఒక ఎకరాకు 80 రూపాయల ప్రకారం చెల్లించాలన్నారు. ఈ సమావేశంలో అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధి శ్రీనివాసులు, వ్యవసాయ విస్తరణ అధికారి భరత్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
