ప్రజా దర్బార్ కు విశేష స్పందన
భవానిపురం, ఆంధ్రప్రభ: ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు ఎమ్మెల్యే సుజనా చౌదరి, భవానీపురం, ఎన్డీయే కార్యాలయంలో నిరంతరం ప్రజా దర్బార్ లను నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు, కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, టీడీపీ సీనియర్ నాయకులు కోగంటి రామారావు, టీడీపీ రాష్ట్ర నాయకులు,గుర్రం కొండ , స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు,మాజీ కార్పొరేట్లు గుడివాడ నరేంద్ర రాఘవ, బుల్లా విజయ్ కుమార్, అత్తలూరి ఆదిలక్ష్మీ పెదబాబు,
ఏపీ ఎం ఎస్ ఎం ఈ అసోసియేషన్ హానరరీ అధ్యక్షులు బాయన వెంకట్రావు, కూటమి నేతలతో కలసి వినతులు స్వీకరించారు.
పశ్చిమ ప్రజలు తమ వినతులను రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు,వైద్య సహాయం వంటి తదితర సమస్యలపై దరఖాస్తు రూపంలో అందజేశారు. సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడంతో పాటు, పెద్ద సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి నిర్ణీత సమయంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మాజీ కార్పొరేటర్లు గుడివాడ నరేంద్ర రాఘవ, బుల్లా విజయ్ కుమార్ , అత్తులూరి ఆదిలక్ష్మీ పెదబాబు తెలిపారు.
