సిసి రోడ్డు నిర్మాణాపనులు ప్రారంభం
చెన్నూర్, ఆంధ్రప్రభ: చెన్నూరు మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డులో సి.ఎస్.ఆర్ (C.S.R.)నిధుల తో నిర్మించనున్న సిసిరోడ్డు పనులను మున్సిపల్ చెర్ పర్సన్ పెద్దింటి పద్మ ప్రారంభించారు. ఈ సందర్బంగా చెర్ పర్సన్ మాట్లాడుతూ సిఎస్ఆర్ నిధులనుంచి సిసి రోడ్డు నిర్మాణానికి 22 లక్షల 50 వేల రూపాయలు మంజూరుఅయ్యాయని. ఈ రోడ్డు బోయ కిష్టయ్య ఇంటి నుండి చెన్న శ్రీనివాస్ ఇంటి వరకు నిర్మాణం జరుగుతుందని అన్నారు. ఈకార్యక్రమంలో మూడో వార్డు కౌన్సిలర్ అంబటి శంకర్. కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దింటి శ్రీనివాస్, సుశీల్ కుమార్ చెన్నవెంకటేష్, తనుగుల సతీష్, సలీం, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
